హైదరాబాద్: 28°C
తెలంగాణ

కట్కూరులో ఇంకుడు గుంతల పరిశీలన

JN: బచ్చన్నపేట మండలం కట్కూరులో జలశక్తి అధికారి డాక్టర్ ఎస్కే ఎండీ సర్దాజ్ భాషా ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్స్‌, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పిట్లను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటి సంరక్షణ పనులను విస్తృతం చేయాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు రైతులు ఫామ్‌ పాండ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.