హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి

JN: రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన రాసమల్ల రాములమ్మ-అయిలయ్య దంపతులు ఒకరి వెంట మరొకరు మృతి చెందారు. అనారోగ్యంతో రాములమ్మ ఈ నెల 18న మృతి చెందగా, ఆమె మృతిని తట్టుకోలేక భర్త అయిలయ్య 24 గంటలు గడవకముందే బుధవారం కన్నుమూశారు. ఏళ్లుగా భార్యకు తోడుగా ఉన్న అయిలయ్య ఆమెను కోల్పోయిన బాధతో మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.