హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనరావుపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

SRCL: కోనరావుపేట మండల కేంద్రంలో ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు.