WNP: ఏదుల మండలం చీర్కపల్లికి చెందిన మల్లేష్ సోషల్ మీడియాలో తనను కులం పేరుతో దూషించాడని రేవల్లికి చెందిన నితీష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రేవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందినట్లు ఎస్సై రజిత తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, డీఎస్పీ సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
తెలంగాణ
కులం పేరుతో దూషణ.. పోలీసులకు ఫిర్యాదు


