హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.!

SRPT: సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై మోతే మండల పరిధిలోని రాఘవాపురం చౌరస్తా సమీపంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.