హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖిల్లాఘణపురంలో ఇసుక వేలం మూడోసారి వాయిదా

WNP: ఖిల్లాఘణపురంలో బుధవారం నిర్వహించిన ఇసుక వేలం పాట మూడోసారి వాయిదా పడింది. ట్రాక్టర్ ఇసుకకు రూ.1,600కు పైగా పాడాలని అధికారులు సూచించగా, కొందరు రూ.1,980 వరకు పాడారు. రైతులు, వివిధ పార్టీల నాయకులు చర్చించేందుకు విరామం కోరిన సమయంలో తహసీల్దార్ సుగుణ అత్యవసర సమావేశానికి వెళ్లడంతో ఉప తహసీల్దార్ లక్ష్మీకాంత్ వేలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.