NZB: ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకొని బుధవారం ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ గంగాధర్ ఐదుగురికి రూ.10 వేల చొప్పున రూ. 50 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. ఐదుగురికి జరిమానా


