WGL: సంగెం మండలం తిమ్మాపురంలో బుధవారం విద్యుదాఘాతంతో పెంకుటిల్లు దగ్ధమైంది. తాటికొండ విష్ణుకు చెందిన ఇంట్లో మంటలు చెలరేగడంతో గృహోపకరణాలు, దుస్తులు, నగదు తదితర సామగ్రి కాలిపోయాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ. 4.70 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఆర్‌ఐ బాలాజీ తెలిపారు.
తెలంగాణ
VIDEO: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం


