JGL: మల్యాల మండల వ్యాప్తంగా ఆహార భద్రత స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న 17,394 స్మార్ట్ కార్డులను జీపీఓలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కాగితాల రూపంలో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం తరహాలో ఉన్న స్మార్ట్ కార్డులను, ప్రతి ఒక్కరికి అందించనున్నట్లు ఎమ్మార్వో తెలిపారు.
తెలంగాణ
ఆహార భద్రత స్మార్ట్ కార్డుల పంపిణీ


