హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

BDK: భద్రాచలంలోని ఎంజేపీ బీసీ సంక్షేమ కళాశాలను సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం వేడి భోజనం అందించి, కళాశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థినుల భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిరంతరం ANMలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు.