హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను ఎమ్మెల్యే పరిశీలన

BDK: అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టులోని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కంట్రోల్ ప్యానల్తో పాటు పంపులు, మోటార్ల పనితీరు పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా పనుల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే వెల్డింగ్, ఎలక్ట్రికల్, సివిల్ వర్క్స్ పురోగతిని పరిశీలించారు.