MDK: ఏడుపాయల వనదుర్గ భవానీ దేవి గురువారం రోజున భక్తజనానికి దివ్యదర్శనమిచ్చారు. అర్చకస్వాములు అమ్మవారికి వేకువజామునే విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, మహా మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీమాతను సేవించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంజీరా నదీపాయల్లో పవిత్ర స్నానాలాచరించి, బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఏడుపాయల భవానీమాతకు విశేష పూజలు.


