MDK: వర్షాకాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా చిన్న శంకరంపేట మండలం, చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ పాలకవర్గంతో కలిసి ఫాగింగ్ చేయించారు. దోమల నివారణకు గ్రామంలోని వీధులన్నింటిలో పిచికారీ నిర్వహించారు. ప్రజలు తమ ఇండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని సర్పంచ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: దోమల నివారణకు పిచికారీ చర్యలు


