PDPL: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, పెద్దపల్లి పరిధిలో జప్తు చేయబడిన 5 వాహనాలకు ఇవాళ బండారికుంట స్టేషన్ వద్ద బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉ. 9-10 గం. లోపు డిపాజిట్ చెల్లించి రసీదు పొందాలన్నారు. 11 గంటలకు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సమక్షంలో వేలం నిర్వహించబడుతుందని తెలిపారు.
తెలంగాణ
నేడు వాహనాల బహిరంగ వేలం


