హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో ముగిసిన శ్రావణ సప్తహ ఉత్సవాలు

JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఏడు రోజులపాటు జరుగుతున్న శ్రావణ సప్తాహ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించగా, సాయంకాలం సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ కన్నుల పండువగా సాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.