NRPT: దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వం అందించిన స్మార్ట్ రేషన్ కార్డులను నిన్న సర్పంచ్ శ్వేత పంపిణీ చేశారు. పేదల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి కార్డు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


