హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల సమావేశానికి సర్పంచులు డుమ్మా.. MLA ఆగ్రహం

MHBD: గూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల సమస్యలపై చర్చించేందుకు బుధవారం సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చాలామంది సర్పంచులు గైర్హాజరు కావడంతో MLA భూక్య మురళినాయక్ అగ్రహానికి గురయ్యారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి దూరంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.