SRPT: అక్రమంగా తరలిస్తున్న సుమారు 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతగిరి ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు అనంతగిరి మండల పరిధిలోని దుర్గాపురం వద్ద ఓ కారును తనిఖీ చేయగా 20 బస్తాల్లో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
తెలంగాణ
పీడీఎస్ బియ్యం పట్టివేత


