రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ తాజాగా దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లో తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోని 10 పట్టణాల్లో సర్వీసులు విస్తరించినట్లు తెలిపింది. కొత్త ప్రయాణికులకు పరిమిత కాలం పాటు మొదటి రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశీయంగా 225 నగరాల మార్కును దాటడం ద్వారా మరింత మంది ప్రయాణికులకు సర్వీసులను విస్తరించినట్లయిందని కంపెనీ పేర్కొంది.
వ్యాపారం
తెలంగాణలో మరో 10 పట్టణాల్లోకి ఉబర్


