హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీలకతీతంగా నగరాభివృద్ధికి ప్రాధాన్యం

KNR: కరీంనగర్ నగరంలోని అన్ని డివిజన్లకు పార్టీలకతీతంగా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విలీన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.