హైదరాబాద్: 28°C
క్రీడలు

కుల్దీప్‌కు పుజారా మద్దతు

గాలే టెస్టులో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లు వేసిన అతడు 103 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కుల్దీప్‌కు మద్దతుగా పుజారా నిలిచాడు. కుల్దీప్ లాంటి బౌలర్ మీద నమ్మకం ఉంచడం అవసరమని, అతడిని జట్టు నుంచి తొలగించవద్దని మేనేజ్మెంట్‌కు సూచించాడు.