SDPT: గజ్వేల్‌కు చెందిన 21 మంది కరాటే విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 30 నిమిషాల పాటు నిరంతరంగా కటా ప్రదర్శన చేశారు. కరాటే మాస్టర్ కృష్ణ శిక్షణలో విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
తెలంగాణ
విద్యార్థులను అభినందించిన హరీష్ రావు


