కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరరావు బుధవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పలువురు నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో టీడీపీ నేత మృతి


