హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సస్పెండ్

RR: ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. కులాల పేరుతో పలువురిని దూషించారన్న ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో కమిటీ విచారణ చేపట్టింది. విచారణలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.