హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత

GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. 58,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 71,292 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.357 టీఎంసీల నీరు నిల్వ ఉంది.