హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి హుండీలో భారీ ఆదాయం

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో బుధవారం ఈఓ వెంకటేశులు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 19 రోజుల ఆదాయాన్ని లెక్కించగా రూ.1,36,83,425 నగదు, 115 గ్రాముల బంగారం, 406 కిలోల 290 గ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా హుండీలో లభించిందని, మొత్తం 77 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు వెల్లడించారు.