హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోటపల్లిగూడూరులో 14 బైకులు స్వాధీనం

NLR: తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కృష్ణపట్నం పోర్టు సీఐ ఆధ్వర్యంలో చింతోపు గ్రామంలో ఇళ్లతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పత్రాలను పరిశీలించారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, హెల్మెట్ పై అవగాహన కల్పించారు.