హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో చర్చ జరపాలి

అన్నమయ్య: విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. రాయచోటిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు.