హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్టు

ప్రకాశం: మద్దిపాడు (మం) ఇనుమనమెల్లూరు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని స్థానిక పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.28,420 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని, పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.