VKB: బషీరాబాద్ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తాండూరు నుంచి బషీరాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లారీని అడ్డుకుని అదుపులోకి తీసుకుని బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్ తెలిపారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణాకు చెక్


