WNP: ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్ సూచించారు. పెబ్బేరు మండలం జనంపల్లిలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పంటలను పరిశీలించిన ఆయన, ఆయిల్‌పామ్ సాగుతో మంచి ఆదాయం పొందవచ్చన్నారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ఆరుతడి పంటలతో మంచి ఆదాయం'


