హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీసుల దమనకాండపై చర్యలు తీసుకోవాలి'

మహబూబాబాద్‌లో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్, జీవో-97 రద్దు కోరుతూ నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు పెట్టడం, లాఠీలతో దాడి చేయడం సరికాదన్నారు. బాధ్యులైన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. విద్యార్థుల గొంతు నొక్కకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.