హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాస్థాయి యోగాసన పోటీలకు ఆహ్వానం

MDK: చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 22న జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యోగాసన సంఘం నాయకులు కరణం గణేష్,మేడ భుజగేందర్ రెడ్డి తెలిపారు. బాలబాలికలు,మహిళలు, పురుషులకు సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 8 గంటలకల్లా ఆధార్, జనన ధ్రువీకరణ, బోనఫైడ్ పత్రాలతో హాజరు కావాలన్నారు.