హైదరాబాద్: 28°C
వ్యాపారం

సెప్టెంబరులో సెమీకాన్ ఇండియా-2026

ఢిల్లీలో సెమీకాన్ ఇండియా-2026 అయిదో ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబరు 17న జరగనుంది. 'సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్' అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. 240కి పైగా అంతర్జాతీయ కంపెనీలు, 150 మందికి పైగా ప్రముఖ వక్తలు, 40కి పైగా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి బృందాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేశారు.