హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో బీడీ తాగిన వ్యక్తి అరెస్ట్

TPT: తిరుమలలో బహిరంగంగా బీడీ తాగుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దానిపై దృష్టి సారించారు. వీడియో ఆధారంగా వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని తమిళనాడులోని అరక్కోణానికి చెందిన ఆర్. సంతోష్ (31)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.