హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ బియ్యం రవాణాలో అడ్డంకులు

MDK: నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచేడ్ మండలాల పరిధిలోని 73 గ్రామాలకు గాను ఇప్పటివరకు 53 గ్రామాలకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా పూర్తయింది. మరో 20 గ్రామాలకు బియ్యం చేరాల్సి ఉంది. కేటాయించిన 20,922 క్వింటాళ్లలో 12,744 క్వింటాళ్లను రేషన్ షాపులకు తరలించారు. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, రవాణాలో జాప్యంతో సరఫరా ఆలస్యమవుతోంది.