PLD: నరసరావుపేట 17వ వార్డు వరవకట్ట ఏరియాలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే డోర్ టూ డోర్ కార్యక్రమం


