హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు

కర్నూలు చిత్తారి వీధిలో షేక్‌ షఫీపై కత్తితో దాడి చేసిన ఫయాజ్‌ బాషను పోలీసులు అరెస్టు చేసి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కల్లూరు దర్వాజా హంద్రీ బ్రిడ్జి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు కర్నూలు1 టౌన్‌ పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ మారుతి శంకర్‌, ఎస్సై మహమ్మద్‌ అలీఖాన్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.