హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలి

ఏలూరు నగరంలో ప్రజలకు మెరుగైన పౌర సేవలందించేలా అధికారులు పనిచేయాలని జేసి,నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అభిషేక్ గౌడ ఆదేశించారు. బుధవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పలు విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, మెప్మా విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.