హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పానగల్‌లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం'

WNP: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్ మండలంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ఫోటోగ్రాఫర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు.