ADB: ఆదిలాబాద్ పట్టణంలో పర్మిషన్ లేకుండా అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న వేదాంత లర్నింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ ఆదిత్య రెడ్డి అన్నారు. ఈ మేరకు లర్నింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
తెలంగాణ
'అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని వినతి'


