SDPT: బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై మోసాలకు గురికావద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదకరమని, డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలుముల సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి'


