హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పొత్తూరి

WG: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని TDP ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు పిలుపునిచ్చారు. బుధవారం నరసాపురం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నాయకులు, కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.