హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల నియంత్రణకు ఎస్పీ ఆదేశాలు

VKB: మోమిన్‌పేట్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ వార్షిక తనిఖీ నిర్వహించారు. పెండింగ్ కేసులు, నేర దర్యాప్తు, CCTNS, NBWలు, CCTV నిఘా తదితర అంశాలను సమీక్షించారు. కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.