హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఏసీపీ

HNK: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యపై దృష్టి సారించాలని కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి సూచించారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన స్టడీ హాల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. స్టడీ హాళ్లు విద్యకు ఫ్యాక్టరీలుగా నిలుస్తాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే యువత స్టడీ హాళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.