హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ డివిజనల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ విజయనగరం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతలు, నేర నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు. ముందుగా సబ్ డివిజనల్ కార్యాలయ ప్రాంగణం, రికార్డులను నిశితంగా పరిశీలించారు. అలాగే, సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు.