ఖమ్మంలో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురిని ఖమ్మం సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 నకిలీ బంగారు ఉంగరాలు, 35.8 గ్రాముల బరువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజ్‌కుమార్ గౌడ్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని వారు తెలిపారు.
తెలంగాణ
నకిలీ బంగారంతో మోసం.. ముగ్గురి అరెస్ట్


