హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

KRNL: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూళ్లలో 7 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఈవో సుదాకర్ తెలిపారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం, కృష్ణగిరి, ఆస్పరి, ఆలూరు స్కూళ్లలో PGT, TGT పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పీరియడ్‌కు రూ.250 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.12 వేల వరకు చెల్లిస్తారని, ఈ నెల నుంచి ఏప్రిల్ 2027 వరకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేపడతారని చెప్పుకొచ్చారు.