VZM: పశుసంవర్ధక శాఖ అధికారులు ఎస్పీ దామోదర్‌ను బుధవారం కలిసి బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. లోగిస రామకృష్ణతో పాటు మరికొందరు వ్యక్తులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. జంతు సంక్షేమ సంఘంలో తనకు స్థానం కల్పించని కారణంగా ఈ నెల 14న ఫోన్ ద్వారా బెదిరించారని వినతిపత్రంలో వివరించారు. నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి'


