హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సిబ్బందికి ఆదేశాలు.

MDK: హవేలీ ఘన్‌పూర్ మండలంలో 108 అంబులెన్స్ సేవలను జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని వైద్య పరికరాల పనితీరును, మందుల నిల్వలతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఈఎంటీ గణేష్, పైలట్ రఘు పాల్గొన్నారు.